News March 25, 2024

కాంగ్రెస్‌లో చేరనున్న మరో వైసీపీ ఎమ్మెల్యే?

image

AP: చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నిన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలతో HYDలో భేటీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే.

Similar News

News October 31, 2025

త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 29న జరగాల్సి ఉండగా.. తుఫానుతో వాయిదా పడిందన్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో 41 వేల ఇళ్లను మంజూరు చేశామని, రూరల్ పరిధిలో ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం రూ.540 కోట్లు మంజూరు చేసింది.

News October 31, 2025

కిడ్నాప్ నుంచి త్రుటిలో తప్పించుకున్నా: నటి

image

ముంబైలో 20 మంది <<18153268>>కిడ్నాప్<<>>, నిందితుడు రోహిత్ ఆర్య ఎన్‌కౌంటర్ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ స్పందించారు. ‘రోహిత్ ఓ ప్రొడ్యూసర్‌గా నాకు పరిచయం. ఓ హోస్టేజ్ చిత్రం గురించి మాట్లాడటానికి OCT 28న కలవాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దు చేసుకున్నా. మరుసటి రోజు అతని గురించి వినగానే షాకయ్యా. రోహిత్ బారిన పడకుండా దేవుడే కాపాడాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.