News October 28, 2024
ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్లో తారల సందడి

ANR జాతీయ అవార్డు ఫంక్షన్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.
Similar News
News January 31, 2026
యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.
News January 31, 2026
పెసర, మినుములో తెల్లదోమ నివారణకు సూచనలు

పెసర, మినుము పంటల్లో తెల్లదోమల ముప్పు పెరిగింది. ఇవి పంటలను ఆశించి మొక్కల ఆకులోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులును కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 1.5ml లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తామర పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 31, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో ఉద్యోగాలు

<


