News November 24, 2024

ధైర్యముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు లోకేశ్: వైసీపీ

image

AP: బొంకులగళం పేరుతో చేసిన యాత్రలో <<14697290>>లోకేశ్<<>> ఇచ్చిన హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదని వైసీపీ ఫైరయ్యింది. ‘అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తారు? ఈ ఏడాది ఇచ్చే అవకాశం ఉందా? ఒక్క బిడ్డకే ఇస్తారా? కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఇస్తారా? ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు ఎప్పుడిస్తారు? నువ్వు మంత్రివి అయితే, నీకు ధైర్యం ఉంటే వీటికి సమాధానం చెప్పు’ అని సవాల్ విసిరింది.

Similar News

News December 8, 2025

శరీరానికి కాపర్ అందితే కలిగే లాభాలు ఇవే!

image

శరీరానికి అవసరమైన కాపర్ అందితే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మతిమరుపు దరిచేరదు. వృద్ధులకు అల్జీమర్స్ ప్రమాదం ఉండదు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు, ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. క్యాన్సర్ సెల్స్ నాశనమవుతాయి. బాడీలో నుంచి ఫ్రీ రాడికల్స్ బయటకుపోతాయి.

News December 8, 2025

‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు

image

ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్‌గా ఫోకస్డ్‌గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్‌గా ₹1000CR వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్‌ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.

News December 8, 2025

అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

image

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.