News October 4, 2024
వేగంగా పచ్చబడుతున్న అంటార్కిటికా!

తెల్ల దుప్పటి కప్పుకొని కనిపించే అంటార్కిటికా పర్యావరణ మార్పు కారణంగా పచ్చబడుతోంది. పరిశోధకులు ఈ విషయాన్ని నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో తెలిపారు. గడచిన 4 దశాబ్దాల్లో అంటార్కిటికా పచ్చదనం 10 రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 1986లో 0.4 చదరపు మైళ్లున్న పచ్చదనం 2021 నాటికి 5 చదరపు మైళ్ల విస్తీర్ణానికి చేరిందని వెల్లడించారు. ఈ మార్పు భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు.
Similar News
News January 19, 2026
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.
News January 19, 2026
అమరావతికి స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు

AP: అమరావతికి స్వయంప్రతిపత్తి కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. తొలిసారిగా ప్రపంచబ్యాంకు, ADB రూల్స్‌కు అనుగుణమైన రీతిలో పాలనా వ్యవహారాలు సాగేలా ఇవి ఉండనున్నాయి. ఆర్థిక అవసరాలు తీరేలా భూములు అమ్ముకొనే వీలు కల్పించనున్నారు. వనరులను మదింపుచేసి స్థిరమైన రాబడి కోసం పెట్టుబడులు వచ్చేలా ఫ్రేమ్వర్కును ఏర్పరుస్తారు. పాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత MNP చట్టాలనూ మారుస్తారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


