News November 24, 2024

జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కేసు?

image

AP: సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ CM జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. PC యాక్ట్ కింద కేసు నమోదు చేయొచ్చా అనే కోణంలో న్యాయ సలహా కోరింది. ఇప్పటికే USలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఛార్జిషీటులో జగన్ పేరు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే PC యాక్ట్‌లోని 17ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.

Similar News

News December 8, 2025

విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

image

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.

News December 8, 2025

వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

image

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.

News December 8, 2025

చెన్నై టు రష్యా.. నూతన సరకు రవాణా మార్గం

image

భారత్-రష్యా మధ్య సరకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రష్యాకు నౌకల ద్వారా సరకుల రవాణాకు 40 రోజుల సమయం పడుతోంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరకులు చేరతాయి. కాగా ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.