News July 5, 2024

కశ్మీర్ వ్యతిరేక పార్టీకి బ్రిటన్‌లో అధికారం.. INDతో బంధం కొనసాగేనా?(1/2)

image

బ్రిటన్ ఎన్నికల్లో ఘనవిజయంతో కైర్ స్టార్మర్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా లేబర్ పార్టీ భావజాలం ఉండటంతో 2 దేశాల బంధం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కశ్మీర్ ప్రజలకు నిర్ణయాధికారం ఇవ్వాలని, అక్కడికి అంతర్జాతీయ పరిశీలకులను పంపాలంటూ ఆ పార్టీ నేత జెరెమీ 2019లో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ పార్టీవి ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ అప్పట్లో భారత్ తీవ్రంగా మండిపడింది.

Similar News

News March 30, 2026

US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

image

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.

News March 30, 2026

గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

image

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్‌ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.

News March 30, 2026

75 ఏళ్ల వయసులో మహిళల విడాకులు.. భర్తల వయసు ఎంతంటే?

image

సిమ్లా(HP)లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు భర్తలకు విడాకులు ఇచ్చారు. రెండు ఘటనల్లోనూ భార్యల కంటే భర్తల వయసు(59, 39 ఏళ్లు) తక్కువ ఉండటం గమనార్హం. అలాగే పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారు. మొదటి కేసులోని జంట 1990లో పెళ్లాడగా 2010 నుంచి దూరంగా ఉంటోంది. రెండో కేసులో జంట 2008లో వివాహం చేసుకోగా 2021 నుంచి విభేదాలు మొదలయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సమ్మతితో విడిపోయారు.