News November 27, 2024
యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరు ‘ఈగల్’గా మార్పు?
AP: యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’గా మార్చడంపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపిందన్నారు. ఈ భేటీలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
Similar News
News November 27, 2024
BREAKING: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు ఈగల్గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.
News November 27, 2024
9 నెలల్లో రూ.11,333 కోట్ల సైబర్ మోసం
ఈ ఏడాది తొలి 9నెలల్లో భారత్ రూ.11,333కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్టాక్ ట్రేడింగ్ స్కామ్లో రూ.4,636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్తో రూ.3,216 కోట్లు, డిజిటల్ అరెస్ట్ మోసాల వల్ల రూ.1,616కోట్లు నష్టపోయినట్లు వివరించింది. 2021నుంచి మొత్తం 30.05లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు వచ్చాయంది. ఇందులో 45 శాతం మోసాలు కంబోడియా, మయన్మార్, లావోస్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు.
News November 27, 2024
EVMలపై ఆందోళన కరెక్టేనా?
మహారాష్ట్ర, హరియాణా ఓటములకు నిందిస్తూ ఇండియా కూటమి EVMలపై వీధి, న్యాయ పోరాటాలకు సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేకసార్లు వాటి విశ్వసనీయతను శంకించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఓడినప్పుడు ఒకలా గెలిచినప్పుడు మరోలా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పింది. AP పార్టీల తీరునూ తప్పుబట్టింది. మరి EVMలపై పోరాటం కరెక్టేనంటారా? మీ కామెంట్.