News March 6, 2025
‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
వరుసగా రెండో రోజూ స్టాక్‌మార్కెట్లు అదుర్స్

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,544 (+207), సెన్సెక్స్ 74,340 (+609) వద్ద ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణాలు. రియాల్టీ సూచీ తగ్గింది. O&G, మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, PSE, ఫార్మా, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్, FMCG షేర్లు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, హిందాల్కో, BPCL, NTPC టాప్ గెయినర్స్. TECHM, BEL, ట్రెంట్ టాప్ లూజర్స్.
News March 6, 2025
రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారు: సిద్ధూ

భారత క్రికెటర్ KL రాహుల్‌పై మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరినా సిద్ధంగా ఉండే నిస్వార్థమైన ప్లేయర్ అన్నారు. T20ల్లో ఓపెనర్‌గా, BGTలో పేసర్లను ఎదుర్కొనేందుకు 3వ స్థానంలో, CTలో కీపింగ్‌తో పాటు 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారని మేనేజ్మెంట్కు సెటైర్ వేశారు.
News March 6, 2025
భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.