News April 12, 2024

సిక్కింలో ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’ ప్రయోగం

image

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్’‌ (ATGM)ను భారత ఆర్మీ ప్రయోగించింది. త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో 17 వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు. పర్వత ప్రదేశాల నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించనున్నారు. ఈ మిస్సైల్స్ ఒక సైనికుడు తీసుకెళ్లేంత చిన్నవిగా ఉంటాయి.

Similar News

News November 16, 2024

మిలిటరీ హెలికాప్టర్‌లో బ్రిటిష్ సైనికుల శృంగారం!

image

UKలోని సైనిక శిక్షణా ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు హద్దులు దాటారు. రూ.75 కోట్ల మిలిటరీ హెలికాప్టర్‌ కాక్‌పిట్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయారు. ఇద్దరూ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు. అర్ధనగ్నంగా ఉన్న వారికి వెంటనే దుస్తులు ధరించాలని సూచించారు. పురుషుడు ఆర్మీ యూనిఫాంలో ఉండగా మహిళ మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్నారు. అయితే ఈ సంఘటన 2016లో జరిగిందని, ఇప్పుడు వైరలవుతోందని ‘ది సన్’ పేర్కొంది.

News November 16, 2024

టీమ్ ఇండియాకు షాక్.. కోహ్లీకి గాయం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందే టీమ్ ఇండియాను గాయాల బెడద వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఆయనను స్కానింగ్‌కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా మోచేతి గాయాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు అందుబాటులో లేకపోయినా భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

News November 16, 2024

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం
* 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం.
* 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో)
* 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం.
* 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం.
* 1973: భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.