News September 30, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ న‌టుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేరళ పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖ‌లు చేసిన‌ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

Similar News

News September 30, 2024

PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం

image

దేశంలో EVల వినియోగాన్ని మ‌రింత ప్రోత్స‌హించ‌డానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్‌లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేప‌టి నుంచి(మంగ‌ళ‌వారం) ఈ స్కీం అమ‌లులోకి రానుంది.

News September 30, 2024

కాంగ్రెస్ వాళ్లు అటు వైపు వెళ్లకండి: KTR

image

TG: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విననన్ని బూతులు తిడుతున్నారు. దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్లకండి. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. మీకు ఇదే నా సూచన. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలోకి కూడా వెళ్లలేరు’ అని అన్నారు.

News September 30, 2024

ప్రభుత్వానికి లేఖ రాయనున్న ‘అప్సా’

image

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) రద్దు అంశాన్ని పున:పరిశీలించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇటీవల అప్సా గుర్తింపు రద్దుపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ప్రస్తుతం అప్సా రద్దు ఫైల్ సీఎం వద్దకు చేరగా, రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.