News September 8, 2024
ANUలో పాముకాటుతో బుద్ధిజం విద్యార్థి మృతి
గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రక్త పింజర పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయన్మార్‌కు చెంది కొండన్న ANUలో MA బుద్ధిజం చదువుతున్నాడు. శనివారం క్యాంపస్ ఆవరణలో పుట్టగొడుగులు ఏరుతుండగా పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, సిబ్బంది అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News October 10, 2024
గుంటూరు : విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్‌లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
News October 10, 2024
అమరావతి: రతన్ టాటా మృతిపై సీఎం, మంత్రి మండలి సంతాపం
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మండలి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు గురువారం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాటా మృతి ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
News October 10, 2024
నందిగం సురేశ్ ఫిర్యాదు.. కలెక్టర్‌కు నోటీసులు
తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేశ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మర్డర్ కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు.