News September 9, 2024

ANUలో విద్యార్థి మృతి.. ఆ గంటన్నరే ప్రాణం తీసింది.!

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మయన్మార్‌కు చెందిన కొండన్న(38) ఆదివారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, కాటేసిన పాముకోసం వెతుకుతూ గంటన్నర పాటు వెతకడం ప్రాణాలు పోయేలా చేసినట్లు తెలుస్తోంది. మయన్మార్‌లో ఎవరినైనా పాము కరిస్తే దానిని చంపి ఆస్పత్రికి తీసుకెళ్తే, ఆపాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఇదే విధంగా కొండన్న కూడా పాము కోసం వెతికి వైద్యసాయం ఆలస్యంగా పొందడమే చనిపోవడానికి కారణమైంది.

Similar News

News October 29, 2025

GNT: ఒక్క రాత్రిలో 1355.9 మి.మి వర్షపాతం

image

29 రాత్రి 12 గంటల నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు. కాకుమాను116, పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.2, వట్టిచేరుకూరు 76.2, దుగ్గిరాల 74.6, తాడేపల్లి 74.2, GNT వెస్ట్‌ 68.8, పెదకాకాని 66.2, తాడికొండ 64.6, ఫిరంగిపురం 63.8, తుల్లూరు 62.8, తెనాలి 60.9, మేడికొండూరు 60.2, మంగళగిరి60, పొన్నూరు58, GNT ఈస్ట్‌ 58 మి.మిగా నమోదయింది.

News October 29, 2025

GNT: తుపాను దెబ్బకు వరి పంటలపై ఆందోళన

image

మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి పంటలు ఈనె, గింజ పాలుదశల్లో ఉండగా భారీ వర్షం, గాలుల తాకిడికి నేలవాలుతున్నాయి. ఇప్పటికే 20 శాతం వరి పంటలు నష్టపోయినట్లు అంచనా. పంట తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులోనే తుపాను రావడంతో కోత ముందు కష్టాలు పెరిగాయని చెబుతున్నారు.

News October 29, 2025

అర్థరాత్రి ఆర్టీజీఎస్‌లో మంత్రి లోకేశ్ సమీక్ష

image

తుపాను తీవ్రతపై మంత్రి లోకేశ్ అర్థరాత్రి 12 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పాల్గొన్నారు. తుపాన్ తీరం దాటే సమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.