News January 30, 2025

ANU: డిగ్రీ మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వీసి కే.గంగాధరరావు విడుదల చేశారు. పరీక్షలకు 9329 మంది హాజరవగా 5198 మంది ఉత్తీర్ణులు అయ్యారని ఆయన తెలిపారు. పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సందేహాలు ఉంటే రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 13, 2025

నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

image

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.

News December 12, 2025

కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నక్కల ఆగస్టీన్

image

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News December 12, 2025

గుంటూరు: వైసీపీ మీడియా ప్యానలిస్టులు వీరే.!

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నూతన మీడియా ప్యానలిస్టులను నియమించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈ జాబితాలో అవకాశం దక్కింది. ఆవుతు శ్రీధర్, షేక్ మహబూబ్ షరీఫ్‌‌ను హిందీ ఛానెల్స్ ప్యానలిస్ట్‌గా నియమించారు. వీరు పార్టీ తరఫున మీడియాలో వాణి వినిపించనున్నారు.