News July 12, 2024
ANU: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 9, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు నేడు పెదకాకానిలోని శంకర ఐ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పర్యటించి పరిశీలించారు. ఏర్పాట్లని పక్కాగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 8, 2025
తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News November 8, 2025
రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు: మంత్రి నారాయణ

రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు పనులు మొదలు పెడతామని చెప్పారు. కాగా రాజధాని అమరావతికి భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులు నివసించే గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.


