News September 6, 2025

ANU: ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ 4వ సెమిస్టర్ ఫలితాలు శనివారం అధికారులు విడుదల చేశారు. రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 15న చివరి తేదీగా పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్‌కు ఒక్కొక్క సబ్జెక్టుకు ఈ నెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు.

Similar News

News September 7, 2025

ఆంధ్రాప్రెన్యూర్స్ పేరు నిలబెట్టండి: సీఎం చంద్రబాబు

image

AP: యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని, ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని అన్నారు. ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘సమాజానికి సంపద సృష్టించి సేవలందించండి. అంతర్జాతీయ బ్రాండ్‌గా మన ఉత్పత్తులు తయారు కావాలి’ అని సూచించారు.

News September 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 7, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
✒ ఇష: రాత్రి 7.38 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 7, 2025

ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

image

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.