News February 27, 2026

ANU: ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9వ తేదీ లోపు రూ.1,860 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.

Similar News

News February 28, 2026

చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

image

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.

News February 28, 2026

రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

image

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.

News February 28, 2026

VKB: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు: SP

image

వికారాబాద్ జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని నొక్కి చెప్పే అనేక సూచనలు చేశారు. క్రమం తప్పకుండా పరేడ్‌లను నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలన పరస్పర సమన్వయం పెరుగుతుందని పేర్కొన్నారు. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.