News October 21, 2025

ANU: ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ ఫలితాలను మంగళవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ 3-4, 5-8 సెమిస్టర్లలో 84.05%, ఎల్‌ఎల్‌బీ 5-4 సెమిస్టర్‌లో 63.02% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 2025లో జరిగిన ఎల్‌ఎల్‌బీ 3-1, 5-5 రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: 200 ఉద్యోగాలు.. రేపే అవకాశం

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జె.వి.జి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హత గల 19-23 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావాలని సూచించారు.

News October 22, 2025

భీమవరం DSP పై పవన్ సీరియస్.. హోం మంత్రి స్పందన

image

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ నివేదికను కోరిన విషయం తెలిసిందే. దానిపై హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాగా డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయని పవన్ అన్నారు.

News October 22, 2025

అనకాపల్లి మార్కెట్‌లో పెరిగిన బెల్లం ధరలు

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో మంగళవారం బెల్లం ధరలు పెరిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ రకం 100 కిలోల బెల్లం ధర రూ.6,090కు పెరిగింది. మార్కెట్‌కు 871 బెల్లం దిమ్మలు వచ్చాయి. వీటిలో 1వ రకం 489, రెండవ రకం 244, నల్ల బెల్లం 128 ఉన్నాయి. 2వ రకం రేటు రూ.4,600 పలికింది. 3వ రకం రూ.4,000 పలికకింది. నాగుల చవితి వరకు ఇవే రేట్లు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు భావిస్తున్నారు.