News September 27, 2025
ANU: ఏపీ పీసెట్ -2025 చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన పీసెట్- 2025కు సంబంధించిన చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రవేశాల కన్వీనర్ పాల్ కుమార్ శనివారం విడుదల చేశారు. వెబ్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 30 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
Similar News
News September 27, 2025
పవన్ ఎందుకు మౌనంగా ఉన్నావు?: అంబటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక పక్క జగన్, మరో పక్కన మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఈ క్రమంలోనే అన్యాయం జరిగితే తిరగబడే స్వభావం అన్నావు, అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు ? అంటూ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. అంబటి తన Xలో శనివారం మాట్లాడారు.
News September 27, 2025
ఏపీని స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా మారుస్తాం: మాధవ్

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా మారే విధంగా కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. చేబ్రోలు (M) వడ్లమూడి ఓ వర్సిటీలో జరుగుతున్న నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలను శనివారం మాధవ్ సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఈగల్ ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు.
News September 27, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఎంఏ మ్యూజిక్, జర్నలిజం, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, మాస్ట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, తదితర ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.