News February 6, 2025

ANU: దూరవిద్యలో ఫైర్ సేఫ్టీ కోర్సులు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ విశాఖపట్నం మధ్య విద్యాసంబంధ సహకారాన్ని కొనసాగించడం కోసం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్సిటీ వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ.. అగ్ని భద్రత, అత్యవసర ప్రతిస్పందన సంబంధిత రంగాలలో ఎన్ఐఎఫ్ఎస్ గత 25ఏళ్ళుగా శిక్షణ ఇస్తుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల వలన ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

Similar News

News February 6, 2025

గుంటూరు: బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

News February 5, 2025

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌత్రాడౌన్‌లో అంజుమ్ అనే చిన్నారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జలుబుతో ఇబ్బంది పడుతుందని చిన్నారిని ఆసుపత్రిలో చూపించడానికి వస్తే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు

image

సాఫ్ట్‌వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు. 

error: Content is protected !!