News September 15, 2025

ANU: పరీక్షా ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో నిర్వహించిన PG సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన M.SC స్టాటిస్టిక్స్, M.SC బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860ల చొప్పున ఈ నెల 24లోపు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Similar News

News September 16, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

News September 16, 2025

ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News September 16, 2025

సిరిసిల్ల: సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే

image

సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి 36 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.