News December 23, 2025

ANU: బీటెక్ రివాల్యుయేషన్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీటెక్ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. I, IV, మొదటి, రెండో సెమిస్టర్, II, IV, మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్
https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.

Similar News

News December 31, 2025

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

image

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్‌కు CCPA ₹50,000 ఫైన్ వేసింది. కస్టమర్ అనుమతి లేకుండానే 10% సర్వీస్ ఛార్జ్ కలిపింది. దానిపై అదనంగా GST కూడా వసూలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమని గుర్తుచేసింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ తప్పనిసరి చేయొద్దని ఢిల్లీ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.

News December 31, 2025

ప్రకాశం పుష్కలం.!

image

ప్రకాశం జిల్లాను ప్రకటించడంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులేసిందనే చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం విడిపోగానే, ఆ స్థానాన్ని అద్దంకి, కందుకూరు డివిజన్లతో భర్తీ చేసింది. బాపట్ల జిల్లాలోని అద్దంకిని, నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్లను ప్రకాశంలోకి కలపడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు ప్రజలకు నెల్లూరు 102 కి.మీ దూరం ఉండగా, ఒంగోలు 43 కి.మీ దూరంలోనే ఉంది.

News December 31, 2025

ESIC MC& హాస్పిటల్‌లో 95 పోస్టులు

image

<>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్ లూథియానాలో 95 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. JAN 8న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీకి గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా.. Sr. రెసిడెంట్‌లకు 45 ఏళ్లు. PROFకు నెలకు రూ.2.5లక్షలు, అసోసియేట్ Prof.కు రూ. 1.7లక్షలు, asst. prof.కు రూ.1.45లక్షలు, Sr. రెసిడెంట్‌కు రూ.1.45లక్షలు చెల్లిస్తారు.