News March 20, 2026

ANU: రిజల్ట్స్ వచ్చాయి

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మ్. డీ మొదటి ఏడాది, బి.ఫార్మసీ 1-6 సెమిస్టర్ల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. (సెప్టెంబర్/అక్టోబర్ 2025) రీ-వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను పరిశీలించుకోవాలన్నారు. మార్కుల్లో మార్పులు ఉంటే తదుపరి అకాడమిక్ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News March 26, 2026

సిటీలోనే సమస్య.. మిగతా ప్రాంతాల్లో సాఫీగా..

image

హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌కు సమస్య లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక్క పెట్రోల్ బంకులోనూ క్యూ లేదని, అన్ని చోట్లా స్టాక్ ఉందని చెబుతున్నారు. CNGకి కూడా ఇబ్బంది లేదంటున్నారు. పానిక్ బయింగ్‌తో కేవలం సిటీలోని బంకుల వద్దే క్యూలు, నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో ప్రాంతం పేరుతో సహా కామెంట్ చేయండి.

News March 26, 2026

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి రైతు ఘోష..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట, దేవరకద్ర, నాగర్ కర్నూల్, గద్వాల, మక్తల్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉన్న చోట రైతులు ఉల్లిగడ్డ సాగు చేస్తుంటారు. గతంలో క్వింటాల్ రూ.2 వేలు ధర పలకగా..ప్రస్తుతం రూ.1,200 పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టం చేస్తే.. పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై జగన్, పవన్ దిగ్భ్రాంతి

image

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. మార్కాపురం ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.