News October 26, 2025

ANU రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.B.A, PG రీవాల్యుయేషన్ ఫలితాలను శనివారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.B.A 4-సెమిస్టర్, M.SC 3-సెమిస్టర్ ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, M.SC 1-సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్& టెక్నాలజీ సబ్జెక్టుల రీవాల్యుయేషన్ ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలన్నారు.

Similar News

News October 28, 2025

కురుమూర్తి స్వామివారి పాదుకలను చూడండి.!

image

కురుమూర్తి స్వామివారి ఉద్దాల (పాదుకలు) ఊరేగింపు మధ్యాహ్నం చిన్న వడ్డేమాన్ గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఉద్దాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. గోవిందా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగనుంది. సాయంత్రం పాదుకలను కొండపైని ఉద్దాల మండపంలో ఉంచుతారు.

News October 28, 2025

మూడోసారీ అధ్యక్షుడు కావాలనుంది: ట్రంప్

image

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.

News October 28, 2025

కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

image

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.