News July 11, 2024
ANU: 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.
News November 25, 2025
ప్రకాశం: ఉద్యానవన సాగు రైతులకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలో ఉద్యానవన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంగళవారం ఉద్యానవన శాఖలపై సమీక్షించిన సందర్భంగా ప్రకాశం జిల్లా రైతుల విషయంపై సైతం మాట్లాడారు. రాయలసీమ, ప్రకాశంలో 92 క్లస్టర్లద్వారా ఉద్యానవన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు.
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


