News July 11, 2024

ANU: 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.

Similar News

News February 21, 2026

GNT: శనగ రైతులకు జాయింట్ కలెక్టర్ సూచన

image

జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రబీ 2025-26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేలమెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు.

News February 21, 2026

GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

image

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.

News February 21, 2026

GNT: విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య గమనిక

image

గుంటూరు జిల్లాలో 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న శారీరక విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 25న జరగనుంది. బృందావన్ గార్డెన్స్ 1వ లైనులో ఉదయం 10గంటల నుంచి ఎంపిక కమిటీ ద్వారా ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు N వెంకరమణప్ప తెలిపారు. దరఖాస్తు చేసుకొని ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.