News October 15, 2025
ANU: B.TECH సప్లమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన B.TECH 1&4-1 సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు, PG-2 సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. B.TECH సప్లిమెంటరీ 35.14%, PG MBA ఇంటర్నేషనల్ బిజినెస్ 95%, MPA థియేటర్ ఆర్ట్స్ 45.45% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.
News October 15, 2025
పైడితల్లి అమ్మవారి ఆదాయం రూ.50.13లక్షలు

విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపంలో బుధవారం లెక్కించారు. హుండీలో రూ.50,13,221 నగదు, 35.3గ్రాముల బంగారం, 421గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ శిరీష చెప్పారు. దేవాదాయ శాఖధికారులు, పోలీసులు సమక్షంలో హుండీని లెక్కించారు. లెక్కింపులో అధికారులు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
News October 15, 2025
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం

AP: అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను CM చంద్రబాబు సచివాలయంలో పరిశీలించారు. విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం చేశారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో విగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.