News February 19, 2025
ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.
Similar News
News March 23, 2025
పెదకాకాని: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 23, 2025
వ్యభిచార గృహంపై దాడి.. తెనాలి నిర్వాహకురాలి అరెస్ట్

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
News March 23, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

తుళ్లూరు మండలం వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో మార్చి 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది ఉత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేదిక ఏర్పాట్లను శనివారం సాయంత్రం సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.