News February 19, 2025

ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.

Similar News

News February 21, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రహదారులపై ప్రమాదానికి కారణం అవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. వాహనాల ప్రమాదాలు జరగకుండా అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, పంచాయితీ, మున్సిపల్, రవాణా శాఖలు సంయుక్తంగా రహదారులను తనిఖీ చేయాలని చెప్పారు.

News February 20, 2025

గుంటూరు జిల్లా టుడే టాప్ న్యూస్

image

★ ANU ఫ్యాకల్టీకి బెస్ట్ టీచర్ అవార్డ్
★ పెన్షన్ల పరిశీలన పారదర్శకంగా జరుగుతుంది: మంత్రి కొండపల్లి
★ గవర్నర్‌ని కలిసిన వైసీపీ శ్రేణులు
★ స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ సతీశ్
★ మాదక ద్రవ్యాలపై నియంత్రణకు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశాలు
★ రేపటి నుంచి జీఎంసీలో ఓటర్ వెరిఫికేషన్ సేవలు
★ పది విద్యార్థులు ఒత్తిడికి గురవ్వొద్దు: DEO

News February 20, 2025

గవర్నర్‌ని కలిసిన వైసీపీ నాయకులు

image

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని నేడు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్, మాజీ మంత్రులు అంబటి, మేరుగ, వెల్లంపల్లి, కారుమూరు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

error: Content is protected !!