News December 23, 2025
ANU CDE పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News December 31, 2025
2025: రెండు రోజులకో అవినీతి కేసు

TG: ఈ ఏడాది సగటున రెండు రోజులకు ఒక అవినీతి కేసు నమోదైనట్లు ACB తెలిపింది. మొత్తంగా 199 కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. ట్రాప్ కేసుల్లో 176 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారని, మొత్తంగా 273 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సోదాల్లో రూ.96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను, రూ.57.17 లక్షల నగదును గుర్తించామంది.
* అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106
News December 31, 2025
ఈ ఏడాది క్రీడల్లో రాణించిన అమ్మాయిలు

ఈ ఏడాది అన్ని రంగాల్లో అతివలు రాణించారు. ముఖ్యంగా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్, అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్, కబడ్డీ వరల్డ్ కప్, రోల్ బాల్ WC గెలిచారు. హాకీ ఆసియా కప్, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీటితో పాటు షూటింగ్ నుంచి చెస్ వరకు, గోల్ఫ్ నుంచి బాక్సింగ్ వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచి స్ఫూర్తిని నింపారు.
News December 31, 2025
OpenAI ఉద్యోగుల సగటు వేతనం ₹13.4 కోట్లు!

టెక్ స్టార్టప్ చరిత్రలోనే OpenAI సరికొత్త రికార్డు సృష్టించింది. తన ఉద్యోగులకు ఒక్కొక్కరికీ సగటున ఏడాదికి $1.5 మిలియన్ల (సుమారు ₹13.48 కోట్లు) విలువైన స్టాక్ ఆధారిత జీతాలు ఇస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు IPOకి వెళ్లేముందు ఇచ్చిన దానికంటే ఇది 7 రెట్లు ఎక్కువ. AI రంగంలో టాలెంట్ కోసం పోటీ పెరగడంతో మెటా వంటి కంపెనీల నుంచి తమ వారిని కాపాడుకోవడానికి OpenAI ఈ భారీ ప్యాకేజీలు ఇస్తోంది.


