News March 17, 2024
ANU: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను విశ్వ విద్యాలయ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని తెలియజేశారు. మొత్తం 9679 మంది పరీక్షలు రాయగా 6494 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సందేహాలుంటే రీవాల్యుయేషన్కు ఈనెల 30వ తేదీలోగా ఒక్కో పేపర్కు రూ. 1240లను చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 24, 2024
గుంటూరు: కేసుల పురోగతిని తెలుసుకున్న అంబటి
ఐ-టీడీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గతంలో నగరంలోని పలు స్టేషన్లలో ఐ-టీటీడీపై తాము ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులతో కలిసి అంబటి శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
News November 23, 2024
గుంటూరు: చిన్నారిపై బీటెక్ విద్యార్థి అఘాయిత్యం
గుంటూరులో శుక్రవారం రాత్రి దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై బీటెక్ విద్యార్థి హత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. గుంటూరులో దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పక్కింటికి చెందిన నవీన్(20) బాలికను ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నవీన్ను అదుపులోకి తీసుకున్నారు.
News November 23, 2024
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం
ఉండవల్లి నివాసంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. అలాగే పార్టీ పాలనాపరమైన అంశాలు, కేంద్రంపై వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.