News December 15, 2025

ANU: LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన LLB రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 1, 3 సంవత్సరాల రెండవ సెమిస్టర్, 3, 5 సంవత్సరాల ఆరో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 20, 2025

మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

image

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.

News December 20, 2025

NZB: ముదురుతున్న పోచారం-ఏనుగు వ్యవహారం

image

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య వ్యవహారం ముదురుతోంది. GP ఎన్నికల్లో పోచారం, ఏనుగు వర్గీయులు వేర్వేరుగా పోటీ చేశారు. MPTC, ZPTC ఎన్నికల్లోనూ రెండు వర్గాలు వేర్వేరుగా తలపడే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. <<18616051>>ఏనుగు రవిందర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో<<>> చెప్పాలని నిన్న పోచారంభాస్కర్‌రెడ్డి అనడం చర్చనీయాంశంగా మారింది.

News December 20, 2025

IRCTC వాలెట్‌తో బోలెడు ప్రయోజనాలు

image

IRCTC E-వాలెట్‌లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.