News August 8, 2024
హరిహర వీరమల్లులో అనుపమ్

హరిహర వీరమల్లులో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇండియన్ సినిమాలోనే గొప్ప నటుడైన అనుపమ్ ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని పేర్కొన్నారు. డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
Similar News
News December 7, 2025
బెంగళూరులోనే IPL మ్యాచ్లు: డీకే

చిన్నస్వామి స్టేడియం నుంచి IPL మ్యాచ్లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘ఇది కర్ణాటక, బెంగళూరు గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో IPL మ్యాచ్లను పుణేకు షిఫ్ట్ చేసేందుకు RCB <<18265735>>ప్రయత్నిస్తోంది.<<>>
News December 7, 2025
బోర్లు ఇంటికి ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. బోర్లు ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశలో ఉండటం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అలా సాధ్యంకాని పక్షంలో కనీసం తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. ఈ నియమాలు పాటించేవారికి అదృష్టం, అభివృద్ధి, సంపద, ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని, వాస్తుకు సంబంధించి దోషాలు కలగవని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.


