News October 18, 2024
అనుష్క హారర్ థ్రిల్లర్ మూవీ.. త్వరలో విడుదల

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఏడాదిగా వెండి తెరకు దూరంగా ఉన్న అనుష్క త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆమె తొలి మలయాళ చిత్రం ‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. హారర్ ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
Similar News
News October 25, 2025
విరాట్ త్వరగా ఫామ్లోకి రావాలి: రవిశాస్త్రి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 25, 2025
నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీశ్ రావు

TG: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ JAC డిమాండ్ చేసింది. 2 లక్షల ఉద్యోగుల భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బాకీ కార్డును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు HYDలోని జలవిహార్లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అన్ని విధాలుగా విఫలమయ్యారని ఫైరయ్యారు. మరోవైపు నిరుద్యోగులు BRS ట్రాప్లో పడొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.
News October 25, 2025
దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.


