News November 6, 2024
రేపు అనుష్క మూవీ అప్డేట్స్

హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
Similar News
News October 25, 2025
వరల్డ్ కప్.. RO-KO ఆడతారహో!

క్రికెట్ ప్రపంచం మొత్తం ‘RO-KO’ అంటూ నినదిస్తోంది. AUSపై మూడో వన్డేలో రోహిత్(121*)-కోహ్లీ(74*) అదరగొట్టేశారు. ఈ ప్రదర్శనతో ఫ్యాన్స్‌లో WC-2027పై ఆశలు చిగురించాయి. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ గురించి అడగ్గా.. ఎగ్జైటెడ్‌గా ఉన్నామని రోహిత్, కోహ్లీ సమాధానం చెప్పారు. దీంతో ‘వీళ్లకు ఏజ్ జస్ట్ ఏ నంబర్, వరల్డ్ కప్‌కు రో-కో వస్తున్నారు, ఈ జోడీ ఉంటే కప్పు మనదే’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News October 25, 2025
అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు: కోర్టు

అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. పేరు, ఫొటోల ఏఐ మార్ఫింగ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఇటీవల చిరు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో 30 మందికి నోటీసులు జారీ చేసింది.
News October 25, 2025
డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో డీసీపీ అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగ తీవ్రంగా గాయపడగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


