News December 14, 2024
‘ఘాటి’ మూవీ నుంచి అనుష్క పోస్టర్

స్టార్ నటి అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ఘాటి నుంచి విడుదలైన పోస్టర్ భయపెడుతోంది. డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తామంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో రక్తపు చేతులు, కన్నీళ్లతో అనుష్క కనిపిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.
Similar News
News November 28, 2025
MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.


