News March 17, 2025
‘ఫ్యామిలీ రూల్’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News December 5, 2025
ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి?

2 పెద్ద ప్రమిదలు, ఒక చిన్న ప్రమిద తీసుకొని వాటికి పసుపు, కుంకుమ పెట్టాలి. బియ్యప్పిండి ముగ్గుపై పెద్ద ప్రమిదలను ఒకదానిపై మరొకటి పెట్టి అందులో రాళ్ల ఉప్పు పోసి పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై చిన్న ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో రెండు వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆ సమయంలో దీపం శ్లోకం చదువుకోవాలి. నైవేద్యం పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం చదివినా శుభ ఫలితాలుంటాయి.
News December 5, 2025
సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్కు మరో అవకాశం

AP: సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2027 DEC 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రైతులు తమ మండల పరిధిలోని మీ సేవ, గ్రామ/వార్డు సచివాలయంలో అప్లికేషన్లు సమర్పించాలని సూచించింది. దరఖాస్తులను 90 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. 2024 జూన్ 15 నాటికి లావాదేవీలు జరిగిన భూములపై రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News December 5, 2025
బంగారం ధరలు మరింత పైకి: WGC

వచ్చే ఏడాది కూడా పసిడి జోరు కొనసాగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయుల నుంచి 15-30% పెరగవచ్చని చెప్పింది. అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యాంకులు బంగారాన్ని కొంటుండటం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ రేట్లు 53% పెరిగాయి. అయితే US దేశ వృద్ధి అంచనాలకు మించి రాణిస్తే ధరలు 5-20% దిగి రావచ్చని WGC పేర్కొంది.


