News October 3, 2024
ఇన్సూరెన్స్‌పై జీరో GSTకి ఛాన్స్ ఉందా?

ఇన్సూరెన్స్‌పై GST తగ్గింపు ఖాయమని తెలుస్తోంది. రాబోయే కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే ట్యాక్స్ రేట్‌ను జీరోకు తీసుకురాకపోవచ్చు. ప్రస్తుతం అన్ని రకాల ఇన్సూరెన్స్‌పై 18% GST అమలవుతోంది. దీనిని హెల్త్‌పై 12, టర్మ్‌పై 5 శాతానికి తగ్గిస్తారని సమాచారం. జీరోకు తీసుకొస్తే ఇన్సూరెన్స్ కంపెనీలకు గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసేవారికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు.
Similar News
News February 8, 2026
SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<
News February 8, 2026
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్‌లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: రష్యాతో దోస్తీకి ముప్పు పొంచి ఉందా?

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరినా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినా.. మాస్కోతో భారత మైత్రికి ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మన రక్షణ వ్యవస్థలో ఇప్పటికీ చాలా ఆయుధాలు రష్యావే. S-400 మిస్సైల్స్, అణుశక్తి వంటి విషయాల్లో ఆ దేశమే మన నమ్మకమైన భాగస్వామి. మరోవైపు చైనాను కట్టడి చేయాలన్నా మనకు పుతిన్ సహకారం చాలా కీలకం. అటు అమెరికా టెక్నాలజీని, ఇటు రష్యా నమ్మకాన్ని భారత్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.


