News September 12, 2025
సంకల్పంతో ఏదైనా సాధించొచ్చు: చంద్రబాబు

AP: పెద్ద కలలు, బలమైన సంకల్పంతో రాష్ట్రం రూ.57 లక్షల కోట్ల GSDP సాధించగలదని చంద్రబాబు అన్నారు. తాను తొలిసారి ఉమ్మడి APకి CM అయినప్పుడు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండేది కాదని Way2News కాన్‌క్లేవ్‌లో గుర్తుచేశారు. ‘అప్పుడు సంక్షేమ పథకాలపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా. సంస్కరణలు చేపట్టా. ప్రజలూ సహకరించడంతో 20ఏళ్లకు HYD అభివృద్ధి చెందింది. అదే సంకల్పంతో ఇప్పుడు ఏపీ ఎదగడం ఖాయం’ అని చెప్పారు.
Similar News
News March 4, 2026
ఇండియా కంటే ఇంగ్లండ్ స్పిన్ మెరుగ్గా ఉంది: మైఖేల్ వాన్

T20 WC: భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌దే పైచేయి అని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ వద్దే మెరుగైన స్పిన్ అటాక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో బెస్ట్ ఇచ్చారని కొనియాడారు. టీమ్‌ఇండియా X-ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.
News March 4, 2026
ఆనాటి ‘రంగుల’ లోకాన్ని మిస్ అవుతున్నారా?

పురోహితుల సూచనతో చాలా ప్రాంతాల్లో హోలీ పండుగను ఇవాళే జరుపుకుంటున్నారు. అయితే చాలాచోట్ల ఒకప్పటి సందడి కనిపించట్లేదు. ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు, పెద్దలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్లు. ఒళ్లంతా రంగులు పూసుకున్నా మనసు నిండా స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ గడిపిన ఆ రోజులు మళ్లీ రావు. మీరూ ఒకప్పటి హోలీని మిస్ అవుతున్నారా? COMMENT
News March 4, 2026
ఇరాన్ యుద్ధానికి ₹18.8 లక్షల కోట్లు..

ఇరాన్‌పై దాడుల్లో తొలి 24 గంటల్లోనే US దాదాపు ₹6,900 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం నెల రోజులు సాగితే మొత్తం ఖర్చు ₹18.87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. భారీ విమానవాహక నౌక ‘USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ నిర్వహణకే రోజుకు ₹58 కోట్లు ఖర్చవుతోందని సమాచారం. చమురు ధరలు పెరగడం, ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల USకు అదనంగా మరో $115 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.


