News June 4, 2024

APకి పూర్వ వైభవం తీసుకొస్తాం: చంద్రబాబు

image

ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై ఇచ్చారు. ‘మోదీ గారికి ధన్యవాదాలు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధించినందుకు ప్రజల తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కూటమిపై వారికున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. మన ప్రజలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించి, పూర్వ వైభవం తీసుకొస్తాం’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News November 25, 2025

ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

News November 25, 2025

పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

image

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.

News November 25, 2025

CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in