News April 16, 2025

AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

image

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News April 25, 2025

విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.

News April 25, 2025

నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 25, 2025

భారత్, పాక్ సంయమనం పాటించాలి: UN

image

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.

error: Content is protected !!