News January 28, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

* అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతికి విశాఖలో 500 చ.గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్-1 జాబ్
* ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
* అమరావతిలో వీధిపోటు స్థలాలు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు.. అమరావతి పరిధిలో అనాథలకు, భూమి లేని పేదలకు పెన్షన్లు
* అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూ కేటాయింపు
Similar News
News February 6, 2026
జూన్ 1న ఈఏపీసెట్ ఫలితాలు!

AP: ఈఏపీసెట్‌కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్‌కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్‌కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.
News February 6, 2026
యాసంగి వేరుశనగ సాగు – నీటి యాజమాన్యం

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.
News February 6, 2026
ఆయిల్ ఇండియా లిమిటెడ్ 29 పోస్టులకు నోటిఫికేషన్

<


