News December 16, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* మిషన్ వాత్సల్య పథకం కింద మహిళలు, పిల్లల సంరక్షణకు 53 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.
* ఖరీఫ్ సీజన్‌లో 51L టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 24.32L టన్నుల సేకరణ పూర్తి. 3.70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5,544 కోట్లు జమ.
* ఎరువుల డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా లైసెన్సులు రద్దు, కఠిన చర్యలు: వ్యవసాయ శాఖ

Similar News

News December 22, 2025

నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

image

TG: దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇవాళ మొదటి సమావేశంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పనులు, తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలు వంటివి వీరికి సవాలుగా మారే అవకాశముంది.

News December 22, 2025

బిగ్‌బాస్ విన్నర్.. ఎంత గెలుచుకున్నారంటే?

image

బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా నిలిచినందుకు కళ్యాణ్ పడాల రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారానికి రూ.70వేల చొప్పున రూ.10.50 లక్షలు సంపాదించారు. రాఫ్ టైల్స్ కంపెనీ ఆయనకు మరో రూ.5 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో మొత్తం రూ.50 లక్షలు దాటింది. మరోవైపు మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును ఆయన అందుకున్నారు.

News December 22, 2025

అప్పుడు ‘కిసాన్’.. ఇప్పుడు ‘జవాన్’

image

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అద్భుతం చోటుచేసుకుంది. 2023 సీజన్‌-7లో ‘జై కిసాన్’ అంటూ ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జవాన్’ కళ్యాణ్ పడాల ‘బిగ్ బాస్-9’ <<18635005>>టైటిల్‌<<>>ను గెలిచారు. తొలి రోజు నుంచే కళ్యాణ్ తన నిజాయతీతో కూడిన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వీరు బిగ్‌బాస్ విన్నర్లుగా నిలవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.