News December 10, 2025

AP న్యూస్ రౌండప్

image

*58,204మంది అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
*ఉచిత సివిల్స్ కోచింగ్‌కు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100మంది ఎంపిక: మంత్రి సవిత
*రైతుల నుంచి MSPకి కొన్న ప్రతి గింజను వేగంగా రైళ్లలో FCI గోదాములకు తరలిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్(తెలుగు)- 2A పరీక్షకు 2 సెషన్స్‌లో కలిపి 17,181మంది అభ్యర్థులు హాజరు

Similar News

News March 3, 2026

పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు: సత్యరాజ్

image

విషయం లేనివారే సినిమా డైలాగులు చెబుతారని TVK చీఫ్ విజయ్‌ని ఉద్దేశించి నటుడు సత్యరాజ్ కామెంట్స్ చేశారు. ‘పంచ్ డైలాగులు జనం చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. పనికిమాలిన మాటలు ప్రతి నటుడూ చెబుతాడు’ అని విమర్శించారు. ఇక TNను మరో అయోధ్యగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సనాతన Vs ద్రావిడ సిద్ధాంతం మధ్యే పోటీ అని, స్టాలిన్ ఉన్నంతవరకు మతశక్తులకు చోటు ఉండదన్నారు.

News March 3, 2026

మత్తు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడి

image

TG: ఓ యువతికి యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బాచుపల్లి(Hyd)లోని బీటెక్ కాలేజీలో జరిగింది. పోలీసుల ప్రకారం.. తనయ్ అనే స్టూడెంట్ అదే కాలేజీలో చదివే యువతికి మాయమాటలు చెప్పి మత్తు చాక్లెట్లు ఇచ్చి క్లాసులోనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. అతని స్నేహితుడూ వేధించాడు. దీంతో ఆత్మహత్యాయత్నం చేయగా ఇంట్లోవాళ్లకు తెలిసి పోలీసులను ఆశ్రయించారు.

News March 3, 2026

హార్ముజ్‌లో నిలిచిపోయిన 700+ నౌకలు

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ మార్గంలో ఇరువైపులా 700+ నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లో 334 క్రూడ్ ఆయిల్, 263 శుద్ధి చేసిన, 109 శుద్ధి చేయని చమురు తదితర ట్యాంకులున్నాయి. మార్చి 1వ తేదీనే ఈ మార్గంలో రాకపోకలకు భయపడి కేవలం 3 ట్యాంకర్లతో 2.8M బ్యారెల్స్ చమురునే నౌకలు తరలించాయి. సాధారణ రాకపోకలకు పోలిస్తే ఇది 86% తగ్గినట్లే. నిన్న ఓ చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి.