News December 15, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News December 16, 2025
IPL-2026 మినీ వేలం అప్‌డేట్స్

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)
News December 16, 2025
లిక్కర్ అమ్మకాలకు డిసెంబర్ కిక్కు

TG: మద్యం అమ్మకాల ఆదాయం ఈ నెలలో భారీగా పెరగనుంది. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే ₹2వేల కోట్లు వచ్చాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. అటు క్రిస్మస్ ఫెస్టివల్, నూతన సంవత్సర వేడుకలూ ఉండడంతో అమ్మకాలు పెరగనున్నాయి. నెలాఖరుకల్లా మరో ₹2వేల కోట్లు సమకూరి మొత్తం ఆదాయం ₹4వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది DECలో ₹3,700 కోట్లు వచ్చాయి.
News December 16, 2025
మహిళలూ.. మీరూ షిఫ్టుల్లో పని చేస్తున్నారా?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఉన్నతస్థానాలకు చేరాలంటే అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉద్యోగంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యతలూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ముఖ్యం. రోజులో ఏదోక సమయంలో కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించాలి. పోషకాహారం తీసుకోవాలి. షిఫ్టుని బట్టి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి.


