News April 16, 2025
AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News September 16, 2025
ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 16, 2025
విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
News September 16, 2025
దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR: చంద్రబాబు

AP: దేశ రాజకీయాల్లో NTR ఒక సంచలనం అని CM చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో సజీవ చరిత్ర-1984 అనే పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR అని, ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని CBN తెలిపారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.