News January 22, 2025
గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ: నారా లోకేశ్

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్లో రూ.255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని చెప్పారు. APలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను కోరారు.
Similar News
News November 20, 2025
ములుగు: ‘స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలి’

గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగులోని సంక్షేమ భవన్లో పీఎం-ఈజీపీ పథకాలపై ఆహ్వాన కార్యక్రమం జరిగింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి, వ్యాపారాలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
News November 20, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 20, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.


