News November 27, 2024
మారిటైమ్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
AP: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మారిటైమ్ పాలసీపై ఆయన చర్చించారు. ‘తీరప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆర్థిక వృద్ధి సాధించొచ్చు. హై కెపాసిటీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లో టెల్స్ ఉపయోగించాలి. నాన్ మేజర్, గ్రీన్ ఫీల్డ్, నోటిఫై చేసిన పోర్టులను తీర్చిదిద్దాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2024
ఉనద్కత్.. IPL వేలంలో 13వసారి..
IPL-2025 వేలంపాటలో భారత సీనియర్ క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ రికార్డు సృష్టించారు. ఆయనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.1కోటికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేలంలో ఎక్కువసార్లు అమ్ముడైన ఏకైక క్రికెటర్‌గా ఆయన అవతరించారు. ఆయనకు ఇది 13వ IPL వేలం. ఏడుసార్లకు మించి ఎవరూ అమ్ముడవలేదు. కాగా ఉనద్కత్ తన IPL కెరీర్లో 8 జట్లకు ఆడారు. KKR, DD, RPS, RR, MI, LSG, RCBకి ఆడారు.
News November 27, 2024
95శాతం కులగణన సర్వే పూర్తి
తెలంగాణలో కులగణన సర్వే 95శాతం పూర్తైంది. 1.18 కోట్ల నివాసాల్లో 1.10 కోట్ల గృహాల్లో సమాచార సేకరణ పూర్తైనట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సేకరించిన డేటా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కాగా అత్యధికంగా ములుగు జిల్లాలో 70.3శాతం డేటా కంప్యూటరైజ్డ్ చేశారు. ఆ తర్వాత యాదాద్రి జిల్లా నిలిచింది. అటు GHMC పరిధిలో 80.5శాతం సర్వే పూర్తైనట్లు ప్రభుత్వం పేర్కొంది.
News November 27, 2024
వక్ఫ్ బిల్లుపై మరింత గడువు కావాలి: జేపీసీ
వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద సవరణల్ని పరిశీలించేందుకు 2025 బడ్జెట్ సెషన్ ముగింపు వరకు టైమ్ అడగాలని పార్లమెంటు జాయింట్ కమిటీ(JPC) నిర్ణయించింది. ఈరోజు జరిగిన జేపీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. అందుకోసం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. వక్ఫ్ విషయంలో తమకు పలు ప్రశ్నలున్నాయని, వాటి సమాధానాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.