News November 26, 2024
సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ: చంద్రబాబు
AP: ఇంటింటికీ సోలార్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో 100శాతం సౌర విద్యుత్ వినియోగాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను కేవలం సోలార్ విద్యుత్ వినియోగించేలా మార్చాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Similar News
News November 26, 2024
మినీ బస్సు బోల్తా.. ఆరుగురు ‘కాంతార’ నటులకు గాయాలు
‘కాంతార: ఛాప్టర్-1’ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక జడ్కల్లోని ముదూర్లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అది చిన్న ప్రమాదమేనని, యథావిధిగా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
News November 26, 2024
నేడు ‘రాజ్యాంగ దినోత్సవం’.. ఎందుకంటే?
మన రాజ్యాంగానికి 1949 NOV 26న ఆమోదం లభించినా స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటీషర్లు మభ్యపెట్టడంతో అమలుకు 2నెలలు పట్టింది. అంతకముందు నెహ్రూ తక్షణ స్వాతంత్ర్యానికి 1929 DEC 31న జెండాను ఎగరేశారు. ఆపై 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి 1950లో అదే రోజు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 2015న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125జయంతి సంవత్సరం సందర్భంగా PM మోదీ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.
News November 26, 2024
బంగ్లాలో ‘ఇస్కాన్’ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీచిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్కి తరలించారు. అయితే ఈ విషయాన్ని మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు.