News August 31, 2025

వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

image

AP: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, పథకాల అమలు, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో చర్చించే అవకాశముంది.

Similar News

News September 1, 2025

ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటం నిషేధం!

image

TG: బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని RTC నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 11 డిపోల్లో దీనిని అమలు చేయనుంది. డ్రైవర్లు డ్యూటీ ఎక్కేముందు తమ ఫోన్లను డిపో మేనేజర్‌కు అప్పగిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కండక్టర్‌కు మేనేజర్ సమాచారమిస్తారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుపై సంస్థ నిర్ణయం తీసుకోనుంది.

News September 1, 2025

ఒకే కారులో మోదీ-పుతిన్ ప్రయాణం

image

చైనా టియాన్‌జిన్ SCO శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా ఒకే కారులో వెళ్లారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు చెక్ పెట్టేందుకు పరస్పర సహకారంపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. SCO సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

News September 1, 2025

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 509 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌లో <<17577609>>భూకంపం<<>> బీభత్సం సృష్టించింది. ఆ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు 509 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జలాలాబాద్ నగరానికి సమీపంలో భూమికి 8 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి.