News February 19, 2025

24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

image

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు.

Similar News

News November 10, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్‌కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు

News November 10, 2025

తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

image

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR న‌ష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు త‌క్ష‌ణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. ఉద్యాన‌, మ‌ల్బ‌రీ తోట‌లూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ ప‌నులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు.

News November 10, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా

image

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.